మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ సిరీస్ ను కైవసం చేసుకుంది.. లార్డ్స్ లో శ్రీలంక తో జరిగిన ఈ మ్యాచ్ ను ఆతిథ్య జట్టు నాల్గవ రోజునే గెలిచింది. ఈ విజయంతో ఇంగ్లండ్ కూడా సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.
ఆలీ పోప్ సారథ్యంలో ఆ జట్టు నాలుగో రోజు శ్రీలంకపై 190 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ విజయం తర్వాత ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో మార్పు రావడంతో దక్షిణాఫ్రికా జట్టుకు ప్రయోజనం చేకూరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 427 పరుగులకు ఆలౌటైంది.
దీనికి సమాధానంగా శ్రీలంక జట్టు 196 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌కు 231 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 251 పరుగులు చేసి శ్రీలంకకు 483 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 292 పరుగులకే కుప్పకూలింది.