Monday, September 16, 2024

ENG vs WI | విండీస్ వైట్‌వాష్..

సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జ‌రిగిన‌ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు చెలరేగింది. దీంతో ఈ సిరీస్‌లో వెస్టిండీస్‌ వైట్‌వాష్‌ అయింది. వరుసగా రెండు టెస్టుల్లో ఓడిన వెస్టిండీస్… మూడో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. దీంతో ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇంగ్లండ్ భారీ విజయంతో సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.

తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్(61), జేస‌న్ హోల్డ‌ర్(59)ల‌ పోరాటంతో 282 ర‌న్స్ చేసిన విండీస్.. రెండో ఇన్నింగ్స్‌లో మార్క్‌వుడ్(5/40) ధాటికి 175 కే కుప్ప‌కూలింది. అనంత‌రం స్వ‌ల్ప ఛేద‌న‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్(57 నాటౌట్‌) ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. మ‌రో ఓపెన‌ర్ బెన్ డ‌కెట్(25 నాటౌట్) మెరిసాడు. దీంతో ఇంగ్లండ్ వికెట్ల 10 తేడాతో గెలుపొంది సిరీస్‌ను హ‌స్త‌గ‌తం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement