పొట్టి క్రికెట్‌లో నెంబర్ వన్ ఇంగ్లండ్‌తో కీలక పోరుకు కోహ్లీసేన సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే నాలుగో మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శన చేయక తప్పదు. ఇప్పటికే 2–1తో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ వశం చేసుకుంటుంది. గత మ్యాచ్‌లో ఇంగ్లండ్ తమ బ్యాటింగ్ పదును చూపించింది. రాయ్, మలాన్ విఫలమైనా… బట్లర్ ప్రదర్శించిన దూకుడుతో జట్టుకు సునాయాస విజయం దక్కింది. ఈసారి మనం కూడా బ్యాటింగ్లో అదరగొడుతేనే విజయం దక్కుతుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే గత మ్యాచ్లో విఫలమైన కె.ఎల్ రాహుల్ ని ఈ మ్యాచ్లో పక్కన పెడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. రాహుల్ వరుసగా మూడు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యాడు. అరంగేట్ర మ్యాచ్‌లో బ్యాటింగ్ కూడా రాకుండా గత పోరులో పక్కన పెట్టిన సూర్యకుమార్ యాదవ్‌ను రాహుల్ స్థానంలో తీసుకొని ఇషాన్ కిషన్‌తోనే ఓపెనింగ్ చేయించాలనే ప్రత్యామ్నాయం భారత్ ముందుంది. కోహ్లి ఫామ్‌లోకి రావడం భారత్‌కు సానుకూలాంశం కాగా, రోహిత్ కూడా చెలరేగితే తిరుగుండదు. కిషన్, పంత్, అయ్యర్‌లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. హార్దిక్ కూడా లయ అందుకుంటే జట్టు విజయావకాశాలు మెరుగుపడతాయి. బౌలింగ్‌లో భువనేశ్వర్, సుందర్ పొదుపు పాటిస్తుండగా… చహల్ మాత్రమే తీవ్రంగా నిరాశపరుస్తున్నా డు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ చహల్‌పై ఎదురుదాడి చేసి ఫలితం రాబట్టారు. శార్దుల్‌కు బదులుగా దీపక్ చహర్‌ను ఆడించాలని కూడా జట్టు భావిస్తోంది.
గత మ్యాచ్ అందుకున్న పెద్ద విజయంతో ఇంగ్లండ్‌లో ఆత్మవిశ్వాసం ఉరకలేస్తోంది. ఎదురు దాడే లక్ష్యంగా జోస్ బట్లర్ భారత బౌలర్లలో గుబులు రేపుతున్నాడు. టెస్ట్‌లలో ఘోరంగా విఫలమైన బెయిర్ స్టో గత మ్యాచ్‌ద్వారా మళ్లీ ఫామ్‌లోకి రావడం ఇంగ్లండ్‌కు ఎదురు లేకుండా పోతుంది. టీ20లలో నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్ కూడా కుదురుకుంటే ఇంగ్లండ్‌కు తిరుగుండబోదు.
ఇక టాస్ గెలిచిన జట్టు మ్యాచ్ ఇస్తుండడం బట్టి చూసుకుంటే ఈ మ్యాచ్లోనూ టాస్ చాలా కీలకం కానుంది. టాస్ గెలిస్తే కోహ్లీ ఈసారి బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది. సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.