Friday, November 22, 2024

BCCI | ఇంగ్లండ్‌ పర్యటన షెడ్యూల్‌ విడుదల..

భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య వచ్చే ఏడాది ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ జరుగనుంది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ, ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు గురువారం ప్రకటించాయి. వచ్చే ఏడాది రెడ్‌ బాల్‌ సుదీర్ఘ టోర్నీ కోసం టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనుంది. జూన్‌ నుంచి ఆగస్టు మధ్య ఈ సిరీస్‌ జరగనుంది.

లీడ్స్‌ వేదికగా 2025 జూన్‌ 20 నుంచి తొలి టెస్టు ప్రాంరభం కానుంది. లండన్‌ వేదికగా జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు జరిగే చివరి ఐదో టెస్టుతో ఈ ఇంగ్లండ్‌ పర్యటన ముగుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్‌ ముగిసిన వెంటనే భారత్‌-ఇంగ్లండ్‌ సిరీస్‌ మొదలునుంది.

అయితే ఈ సిరీస్‌ 2025-27 డబ్ల్యూటీసీ నాలుగో సైకిల్‌లో భాగంగా జరగనుంది. ఇక టీమిండియా చాలా కాలం తర్వాత ఇంగ్లండ్‌ గడ్డపై అడుగుపెట్టనుంది. చివరిసారిగా 2021లో భారత జట్టు టెస్టు సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ పర్యటించింది. అయితే అప్పుడు ఇరుజట్లు చెరో రెండు విజయాలు సాధించడంతో ఆ సిరీస్‌ 2-2తో డ్రాగా ముగిసింది.

కాగా 2025 జూన్‌-జులైలో భారత మహిళల జట్టు కూడా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనుందని బీసీసీఐ వెల్లడించింది. అక్కడ భారత అమ్మాయిలు ఇంగ్లండ్‌ మహిళల జట్టుతో 3 వన్డేలు, 5 టీ20లు ఆడనున్నారు.

భారత్‌-ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ షెడ్యూల్‌..

  • తొలి టెస్టు: 2025 జూన్‌ 20 నుంచి 24.. వేదిక: లీడ్స్‌
  • రెండో టెస్టు: 2025 జులై 2 నుంచి 6.. వేదిక: బర్మింగ్‌హామ్‌
  • మూడో టెస్టు: 2025 జులై 10 నుంచి 14.. వేదిక: లండన్‌ (లార్డ్స్‌).
  • నాలుగో టెస్టు: 2025 జులౖౖె 23 నుంచి 27.. వేదిక: మాంచెస్టర్‌
  • ఐదో టెస్టు: 2025 జులై 31 నుంచి ఆగస్టు 4.. వేదిక: లండన్‌ (ది ఓవల్‌).
Advertisement

తాజా వార్తలు

Advertisement