లండన్: ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా ఆతిథ్య ఇంగ్లండ్- పర్యాటక న్యూజిలాండ్ జట్ల మధ్య గురువారంనాడు తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని బరిలో దిగారు. ఓపెనర్లు టామ్ లాథమ్(1), విల్ యంగ్ (1)క్రీజులో నిలదొక్కుకుండానే పెవిలియన్ చేరారు. వన్‌డౌన్‌లో దిగిన కెప్టెన్ కేన్ విలియమ్సన్(2) కూడా నిరాశపరిచాడు. అటు తర్వాత బరిలోకి దిగిన డేవాన్ కాన్వే(3), డారిల్ మిచెల్(13), టామ్ బ్లండెల్(14) చెప్పుకోదగ్గ పరుగులు చేయకుండానే వెనుదిరిగారు.
కొలిన్ డి గ్రాండ్‌హమ్మీ 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఒంటరి పోరాటం చేశాడు. అతడికి టైలెండర్ బ్యాట్స్‌మెన్‌లెవరూ సహకరించలేదు. కైలీ జెమీషన్(6), టిమ్ సౌథీ(26), అజాజ్ పటేల్(7), ట్రెంట్ బౌల్ట్(14) చేతులెత్తేశారు. దీంతో న్యూజిలాండ్ జట్టు 40 ఓవర్లు మాత్రమే ఆడి 132 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జమేమ్స్ అండర్సన్, మాథ్యూ పాట్స్ అద్భుతంగా రాణించారు. ఇరువురూ చెరో 4 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..