ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా శుభారంబం చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 43 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీ20ల్లో ఇంగ్లండ్‌పై టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియాకు శుభారంభం లభించింది. ఇక చెన్నై వేదికగా రేపు జరగనున్న రెండో టీ20 పోరుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. తొలి టీ20లో ఓడిపోయినా.. రెండో టీ20లో విజయం సాధించి, సిరీస్ సమం చేయాలని లక్ష్యంగా భావిస్తోంది. ఈ క్రమంలో మ్యాచ్ కు 24 గంటల ముందే తుది జట్టును ప్రకటించే ఆనవాయితీని కొనసాగిస్తూ… రేపటి మ్యాచ్ కు జట్టును ప్రకటించింది ఇంగ్లండ్.
పేసర్ గస్ అట్కిన్సన్ ప్లేస్ లో బ్రైడన్ కార్సే ను తుది జట్టులోకి తీసుకుంది. అలాగే వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ ను 12వ ఆటగాడిగా ప్రకటించింది.
వాషింగ్టన్ సుందర్ అవకాశం ..!
మరోవైపు సిరీస్ లో శుభారంభం చేసిన సూర్య సేన.. చెన్నైలో జరిగే రెండో టీ20లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఇక 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి వచ్చిన మహమ్మద్ షమీకి తొలి టీ20 తుది జట్టు దక్కలేదు. అయితే చెన్నై వేదికగా జరిగే రెండో టీ20లో అతన్ని ఆడించే అవకాశాలు ఉన్నాయి.
నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో చెన్నై లోకల్ భాయ్ వాషింగ్టన్ సుందర్‌ను ఆడించే అవకాశాలు ఉన్నాయి. చెపాక్ మైదానం స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ క్రమంలోనే వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకోనున్నారు. బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు.