రాంచిలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ పీకలోతు కష్టాలలో పడింది.. భారత్ స్పీన్ ఉచ్చులో చిక్కుకుని ఎనిమిది వికెట్లు కోల్పోయింది.. ప్రస్తుతం ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.. తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులతో కలుపుకుని ప్రస్తుతం 179 పరుగుల అధిక్యంలో ఇంగ్లండ్ ఉంది..
కులదీప్ నాలుగు, అశ్వీన్ మూడు వికెట్లు పడగొట్టగా… జడేజాకు ఒక్క వికెట్ దక్కింది.. ఇంగ్లండ్ జట్టులో క్రాలే ఒక్కడే 50 పరుగుల మార్క్ ను దాటాడు.. మిగిలిన వారందరూ తక్కువు స్కోర్ కే వెను తిరిగారు..
ఇది ఇలా ఉంటే తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 307 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 219/7తో మూడో రోజు ఆటను ప్రారంభించింది. మరో 88 పరుగులు మాత్రమే జోడించి మిగతా వికెట్లను కోల్పోయింది. ధ్రువ్ జురెల్(90) చివరి వరకూ పోరాడి.. శతకానికి చేరువలో హార్ట్‌లీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ (73) మరోసారి ఆకట్టుకోగా.. గిల్ 38, కుల్‌దీప్ 28 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్ 5, హార్ట్‌లీ 3, అండర్సన్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 353 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.