Tuesday, November 12, 2024

ENG vs WI Test | రెండో టెస్ట్ లోనూ ఇంగ్లండ్ విజ‌యం..

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లండ్ రెండో టెస్టులోనూ ఘన విజయం సాధించింది. 241 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. 385 పరుగుల కొండంత లక్ష్యం ఛేదనలో వెస్టిండీస్ పోరాట పటిమ చూపించకుండానే 143 పరుగులకే ఆలౌట‌య్యి.. ప్రత్యర్థి ముందు తలవంచింది.

కెప్టెన్ బ్రాత్ వైట్ (47; 48 బంతుల్లో, 8 ఫోర్లు), జేసన్ హోల్డర్(37; 42 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్లు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ (5/41) అయిదు వికెట్లతో సత్తాచాటాడు. క్రిస్ వోక్స్, అట్కిన్సన్ చెరో రెండు వికెట్లు తీశారు.

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 416 పరుగులు సాధించింది. ఒలీ పోప్ (121; 167 బంతుల్లో, 15 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీ బాదాడు. డకెట్ (71; 59 బంతుల్లో, 14 ఫోర్లు), స్టోక్స్ (69; 104 బంతుల్లో, 8 ఫోర్లు) రాణించారు. అల్జారీ జోసెఫ్ మూడు, సీల్స్, కెవిన్, కామెమ్ హోడ్జ్ తలో రెండు వికెట్లు తీశారు. ఇంగ్లండ్‌కు దీటుగా వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 457 పరుగుల భారీ స్కోరు సాధించింది. 41 పరుగుల ఆధిక్యం సాధించింది.

హోడ్జ్ (120; 171 బంతుల్లో, 19 ఫోర్లు), అథంజె (82; 99 బంతుల్లో, 10 ఫోర్లు, 1 సిక్సర్), డసిల్వా (82; 122 బంతుల్లో, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తాచాటారు. క్రిస్ వోక్స్ నాలుగు, అట్కిన్సన్, బషీర్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 425 పరుగులు సాధించింది. జో రూట్ (122; 178 బంతుల్లో, 10 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (109; 132 బంతుల్లో, 13 ఫోర్లు) శతకాలతో కదంతొక్కారు. భారీ ఛేదనకు దిగిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన చేసింది. కాగా, జులై 26 నుంచి ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement