అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ బౌలర్ల సత్తా చాటుతున్నారు. 44.4 ఓవర్లలోనే ఇంగ్లండ్‌ను 189 పరుగులకే మట్టికరిపించి ఆలౌట్ చేశారు. తొలుత టాస్ గెలిచి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. 13 ఓవర్ల వరకు ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. జేమ్స్ రెవ్ (13) క్రీజులో ఉన్నాడు. భారత్ తరఫున రాజ్ బావా, రవికుమార్‌కు బౌలింగ్‌లో అదరగొట్టారు. టీమిండియా బౌలింగ్ దెబ్బకు ఇంగ్లండ్ టీం వెంటవెంటనే వికెట్లు కోల్పోతూ పీకల్లోతూ కష్టాల్లో కూరకపోతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లండ్‌కు పేలవమైన ఆరంభం లభించగా, రెండో ఓవర్‌లో రవికుమార్ బౌలింగ్‌లో జాకబ్ బెతెల్ (2) ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యాడు. తన తర్వాతి ఓవర్‌లోనే కెప్టెన్ టామ్ పెర్స్ట్ (0)ని క్లీన్ బౌల్డ్ చేసి రవి భారత్‌కు రెండో విజయాన్ని అందించాడు.
టోర్నీలో భారత జట్టు అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకు నాలుగు సార్లు టైటిల్‌ను కైవసం చేసుకుంది ఇండియా. టీమిండియా ఫైనల్‌కు చేరడం వరుసగా ఇది నాలుగోసారి. 2016లో వెస్టిండీస్‌పై, 2020లో బంగ్లాదేశ్‌పై ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కాగా, ఈసారి కూడా విజయం మనదే అన్న ధీమా వ్యక్తమవుతోంది.