Monday, November 25, 2024

Elena Norman | హాకీ ఇండియాకు మరో షాక్.. మరో కీలక వ్యక్తి రాజీనామా

హాకీ ఇండియాకు మరో బిగ్ షాక్ తగిలింది. ఇటీవలే భారత మహిళల హాకీ జట్టు చీఫ్ కోచ్‌ జ‌న్నెకె స్కాప్‌మ‌న్ తన పదవికి రాజీనామా చేయ‌గా.. తాజాగా హాకీ ఇండియా సీఈఓ ఎలెనా నోర్మాన్ తన పదవికి రాజీనామా చేశారు. 13 ఏళ్ల పాటు సీఈఓగా హాకీ ఇండియాకు సేవలందించిన ఆమె.. ఉక్కిరిబిక్కిరి పని వాతావరణంలో పనిచేయలేనని తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. భార‌త్‌లో మ‌హిళ‌ల‌కు త‌గిన గౌర‌వం లేదంటూ ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. గత మూడు నెలలుగా త‌న‌కు జీతం ఇవ్వలేదని.. ఒత్తిడితో పాటు ఆర్థిక సమస్యలు ఎక్కువ అవడంతో ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న‌ట్టు ఎలెనా నోర్మాన్ తెలిపింది. ఈ క్రమంలోనే ఎలెనా నోర్మాన్ కూడా తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement