దుబాయ్: 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని ఐసీసీ తెలిపింది. ఒలింపిక్స్ కమిటీ విడుదల చేసిన 28 క్రీడల ప్రాథమిక జాబితాలో క్రికెట్‌కు చోటు దక్కలేదు. దీనిపై స్పందించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్..అదనపు క్రీడల విభాగంలో క్రికెట్‌ను చేర్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. ఒలింపిక్స్ ఆతిథ్య నగరం లాంస్‌ఏంజెలెస్ అదనపు క్రీడలను ఎంచుకునే ప్రక్రియ 2023నుంచి ప్రారంభంకానుంది.
క్రికెట్‌ను ఆ విభాగంలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ విషయంలో బీసీసీఐ కూడా మద్దతు ఇస్తోందని ఐసీసీ సభ్యుడు ఒకరు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో అభిమానులు ఉన్న క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చాలని ఐఓసీకి విన్నవించామని ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్‌క్లే తెలిపారు. కాగా ఐఓసీ ప్రధాన ఆటల జాబితాను మాత్రమే విడుదల చేసింది. తాజా ప్రాథమిక జాబితాలో బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌కు కూడా చోటు దక్కలేదు. 2023లో ఒలింపిక్స్ క్రీడల తుదిజాబితాపై పూర్తి స్పష్టత రానుంది.