Thursday, September 12, 2024

ECB | ఇంగ్లండ్ వైట్‌బాల్‌కు కొత్త కోచ్..

ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు కొత్త కోచ్‌ను నియమించింది. ప్రస్తుతం టెస్ట్ టీమ్ కోచ్‌గా ఉన్న బ్రెండన్ మెక్‌కల్లమ్‌కు ప్రమోషన్ ఇస్తూ వైట్ బాల్ హెడ్ కోచ్‌గా నియమించింది. ఈ మేరకు ఈసీబీ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.

2022 మేలో టెస్ట్ టీమ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన మెక్‌కల్లమ్.. ఈసీబీ తాజా నిర్ణయంతో 2027 వరకు మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా కొనసాగనున్నాడు. వచ్చే ఏడాది భారత పర్యటనతో మెక్‌కల్లమ్ వైట్‌బాల్ హెడ్ కోచ్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement