కరోనా ఆంక్షల నడుమ సంబురంగా మొదలైన ఐపీఎల్ టీ20 సిరీస్‌లో ఇవ్వాల ముంబై వేదికగా చెన్నై, కోల్‌కతా జట్ల మధ్య ఫస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా అటు బౌలింగ్ పరంగా.. ఇటు బ్యాటింగ్ పరంగా మంచి ప్రదర్శన చూపింది. తక్కువ పరుగులకే చెన్రైని కట్టడి చేశారు కేకేర్ బౌలర్లు. అయితే.. ధోనీ మెరుపు ఇన్నింగ్స్ చెన్నైకి ప్లస్ అయ్యిందనే చెప్పవచ్చు. ధోనీ చేసిన 50 పరుగుల స్కోర్ చెన్నైకి కొండంత బలంగా నిలిచింది. లేకుంటే తక్కువ స్కోరు చేసిన అపవాదు చెన్నైకి దక్కేది. మొత్తంగా చెన్నై 131 పరుగులు చేసింది.
చెన్నై బ్యాట్స్‌మెన్స్‌లో ఎంఎస్ ధోనీ 50(38 బంతులు, 7 ఫోర్లు, 1 సిక్స్), రాబిన్ ఊతప్ప 28(21 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సులు), అంబటి రాయుడు 15, రవీంద్ర జడేజా 26, గైక్వాడ్ 0, కాన్వే 3, శివం దూబే 3, ధోనీ 2 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో ఉమేష్ యాదవ్ 2, చక్రవర్తి, రస్సెల్ తలో వికెట్ పడగొట్టారు.
ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా బ్యాట్స్‌మన్ మంచి ప్రదన్శన చేశారు. రహానే 44, వెంకటేశ్ అయ్యర్ 16, నితిష్ రాణా 21, శ్యాం బిల్లింగ్స్ 25 పరుగులు చేశారు. కాగా, శ్రేయస్ అయ్యర్ 20, షెల్డన్ జాక్సన్ 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. 133/4