Tuesday, January 14, 2025

Australian Open | తొలి రౌండ్‌లో జకోవిచ్‌కు ఈజీ విక్టరీ !

  • రెండో రౌండ్‌కు అల్కరాజ్‌, జన్నిక్‌ సిన్నర్‌
  • మహిళల సింగిల్స్‌లో స్వియాటెక్‌ బోణి

ఆస్ట్రేలియా ఓపెన్‌లో టెన్నిస్‌ దిగ్గజం, 10-టైమ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ తొలి రౌండ్‌లో సునాయాస విజయం సాధించాడు. వైల్డ్‌ కార్డ్‌తో ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఎంట్రీ ఇచ్చిన అమెరికన్‌ క్రీడాకారుడు నిశేష్‌ బసవరెడ్డిపై 4-6, 6-3, 6-4, 6-2 తేడాతో గెలుపొందాడు.

అల్కరాజ్‌ ఘనవిజయం

2022 యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ కార్లోస్‌ అల్కరాజ్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌లో అద్భుతంగా రాణించాడు. రోడ్‌ లావెర్‌ అరెనా మైదానంలో అలెగ్జాండర్‌ షెచెంకోతో జరిగిన తొలి మ్యాచ్‌లో 6-1, 7-5, 6-1తో ఘనవిజయం సాధించాడు. యూఎస్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌ టైటిల్‌ చేజిక్కించుకున్న అల్కరాజ్‌ తాజాగా యూఎస్‌ ఓపెన్‌పై కన్నేశాడు.

- Advertisement -

డిపెండింగ్‌ చాంపియన్‌ జన్నిక్‌ సిన్నర్‌ కూడా తొలి రౌండ్‌లో గెలుపొందాడు. వరల్డ్‌ నం.36 నికోలస్‌ జారీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ రెండున్నర గంటలపాటు సాగిన హోరాహోరీ పోరులో 7-6(2), 7-6(5), 6-1 తేడాతో సిన్నర్‌ విజయం సాధించాడు.

అలవోకగా స్వియాటెక్‌

అటు ఉమెన్స్‌ సింగిల్స్‌ గ్రాండ్‌ స్లామ్‌లో సెకండ్‌ సీడ్‌, 9-టైమ్‌ గ్రాండ్‌ స్లామ్‌ డబుల్స్‌ చాంపియన్‌ ఇగా స్వియాటెక్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌లో తొలి విజయం నమోదు చేసింది. చెక్‌ రిపబ్లిక్‌ క్రిడాకారిణి కటెరినా సినికోవాపై 6-3, 6-4 తేడాతో స్వియాటెక్‌ గెలుపొందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement