Wednesday, December 18, 2024

IND vs AUS | క‌ష్టాల క‌డ‌లిలో టీమిండియా.. వ‌ర‌ణుడిదే భారం !

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5.30 గంటలకు ప్రారంభమైన మ్యాచ్‌కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగింది. ఇక ఓవర్ నైట్ స్కోరు 405 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా 445 పరుగులు చేసి ఆలౌటైంది.

భారీ టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (4), శుభమన్ గిల్ (1) కొద్దిసేపటికే ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (3), రిషబ్ పంత్ (9) పెవిలియన్ బాట పట్టారు.

దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్ (30 నాటౌట్), రోహిత్ శర్మ క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై పైచేయి సాధించాలంటే భారత్ ఇంకా 394 పరుగులు చేయాల్సి ఉంది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడుతూ పరుగులు సాధిస్తే.. టీమిండియాకు ఓటమి తప్పే అవకాశం ఉంది.

మరోవైపు టీమిండియా అభిమానులు వరుణిడిపైనే ఆశలు పెట్టుకున్నారు. మూడో రోజు కూడా పలుమార్లు వర్షం కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. మంగళ, బుధవారాల్లోనూ గబ్బా ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement