Wednesday, December 4, 2024

IND vs AUS | అడిలైడ్‌లో టీమిండియా..

ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా జట్టు కాన్బెరా నుంచి అడిలైడ్‌కు చేరుకుంది. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ ఎయిర్పోర్ట్ షాపింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

రోహిత్ శర్మ, శుభ్ర్మన్ గిల్ తదితర ఆటగాళ్లు ఎయిర్పోర్ట్ ప్రవేశం ద్వారం నుంచి బయటికి రాగా.. యశస్వి జైస్వాల్ మాత్రం చూసుకోకుండా ‘నో ఎంట్రీ’ అని రాసి ఉన్న ఎరియాలోకి వెళ్లాడు. జైస్వాల్ అక్కడున్న గ్లాస్ డోర్ వెనక లాక్ అయిపోయి అందులోనే ఇరుక్కుపోయాడు. దీంతో భారత ఆటగాళ్లు నవ్వుకున్నారు. కాసేపటికే యశస్వి బయటివచ్చాడు.

ఎయిర్పోర్ట్లోనే కొంతమంది ప్లేయర్లు టోపీల షాపింగ్ చేస్తూ సరదాగా గడిపారు. సర్ఫరాజ్, వాషింగ్టన్ సుందర్ కొన్నిరకాల టోపీలను ధరించారు. సుందర్ బ్లాక్ కలర్ టోపీని పెట్టుకొని ఎలా ఉన్నాను? అని సర్ఫరాజ్ని అడగ్గా.. బాలీవుడ్ సినిమా మిస్టర్ ఇండియాలోని విలన్ ‘మొగాంబో’లా ఉన్నావని (నవ్వుతూ) సర్ఫరాజ్ పేర్కొన్నాడు.

చివరకు అశ్విన్ సూచన మేరకు సుందర్ గోధుమరంగు ఉన్న టోపీని కొనుగోలు చేశాడు. కాగా, డిసెంబరు 6 నుంచి అడిలైడ్ వేదికగా ఆసీస్, భారత్ మధ్య డే/నైట్ (పింక్ బాల్ టెస్టు) ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement