భారత దేశ ఫుట్‌బాల్ క్యాలెండర్ 131వ ఎడిషన్ ది డురాండ్ కప్‌తో ప్రారంభ మవుతుంది. ఈ నెల 16 నుంచే ప్రారంభమవుతుంది. 1980 ఆగస్టు 16న కోల్ కతా ఫుట్‌బాల్ లీగ్‌లో జరిగిన ఒక మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన అల్లర్లు, తొక్కిసలాటలో 16 మంది ఫుట్‌బాల్ అభిమానులు మరణించారు. డురాండ్ కప్ అనేది ఆసియాలోని పురాతన ఫుట్‌బాల్ టోర్నమెంట్. 1988లో ఇది ప్రారంభమైంది. అందువల్లే ఇది భారత్ ఫుట్‌బాల్‌లో ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంది. టోర్నమెంట్‌లో మూడు పార్శ్వాలున్నాయి. ఒకటి డురాండ్, రెండోది ఇండియన్ సూపర్‌లీగ్, సూపర్‌కప్, 1984 నుండి 1894 వరకు బ్రిటీష్ ఇండియా విదేశాంగకార్యదర్శిగా పని చేసిన దాని స్థాపకుడు సర్ హెన్రీ మోర్టిమర్ డూరాండ్ పెట్టారు.
ఇది మొదట సాయుధ దళాల (బ్రిటీష్ ఇండియా, ఇండియా) యొక్క వివిధ విభాగాలు రెజిమెంటల్ కోసం ఫుట్‌బాల్ టోర్నమెంట్‌గా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌కు కోల్ కతాలోని వివేకానంద యువ భారతి క్రిరంగన్ వేదిక కానుంది. ఇక్కడ 85 వేల మంది కూర్చుని వీక్షించవచ్చు. అదే సమయంలో ఇంపాల్ కిషోర్ భారతి క్రిరంగన్‌లో ఫుట్‌బాల్ అభిమానులు 12 వేల మంది వీక్షించే అవకాశముంది. గౌహతి ఇందిరాగాంధీ అథ్లెటిక్ స్టేడియంలో ఒకేసారి 25వేల మంది కూర్చుని చూడవచ్చు.