దులీప్ ట్రోఫీ టోర్నీలో సెమీఫైనల్స్‌లో అటు సౌత్ జోన్, ఇటు వెస్ట్ జోన్ జట్లు విజయం సాధించాయి. ఫైనల్‌కు దూసుకెళ్లాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో నార్త్ జోన్‌పై 2 వికెట్ల తేడాతో సౌత్ జోన్ గెలుపొందింది. 215 పరుగుల లక్ష్యాన్ని ఓ వైపు వర్షం తరుచూ అడ్డంకి, మరోవైపు వెలుతురు లేమితో ఇబ్బందులెదురైనా సౌత్‌జోన్ జట్టు సునాయాసంగా ఛేదించింది. నార్త్ జోన్ 218 (ప్రభ్సిమ్రాన్ సింగ్ 49, విద్వత్ కవీరప్ప 5/28) – 211 (ప్రభ్సిమ్రాన్ సింగ్ 63, విజయ్ కుమార్ వ్యాషక్ 5/76), సౌత్ జోన్ 195 (మయాంక్ అగర్వాల్ 76, వైభవ్ అరోరా 3/57), 219/8 (మయాంక్ అగర్వాల్ 54, హనుమ విహారి 43, హర్షిత్ రానా 3/84).
అలూర్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్‌పై వెస్ట్ జోన్ విజయం సాధించి, ఫైనల్‌కు చేరింది. 390 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో సెంట్రల్ జోన్ విఫలమైంది. 4 వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేసింది. మ్యాచ్ ఆఖరి రోజున వర్షం అడ్డంకి మాదింది. ఫలితం లేకపోవడంతో తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా మ్యాచ్ ఫలితం ప్రకటించారు. వెస్ట్ జోన్ 220 (అతిత్ శేథ్ 74, ధర్మేంద్ర సిన్ష్ జడేజా 39, శివమ్ మావి 6/44) – 297 (సూర్యకుమార్ యాదవ్ 52, ఛతేశ్వర్ పుజారా 133, సౌరభ్ కుమార్ 4/79, సరాన్ష్ జైన్ 4/56). సెంట్రల్ జోన్ 128 (రింకు సింగ్ 48, ధ్రువ్ జురెల్ 46, అర్జన్ నాగస్వళ్ల 5/74, అతిత్ శేథ్ 3/27)- 128/4 (రింకు సింగ్ 40, యువ్రాజ్సిన్హ్ దోడియా 1/16)