Tuesday, September 17, 2024

Duleep Trophy | పంత్, సర్ఫరాజ్ ఊచకోత.. ఇండియా-బిదే పైచేయి…

దులీప్ ట్రోఫీలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇండియా-ఏ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-బీ పైచేయి సాధిస్తోంది. మూడో రోజు ఆట ముగిసేస‌రికి ఆరు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచిన జట్టును పంత్‌తో కలిసి సర్ఫరాజ్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మూడో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో టీమ్-ఏ కంటే 240 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

రిషభ్ పంత్ (61; 47 బంతుల్లో, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడ‌గా… సర్ఫరాజ్ ఖాన్ (46; 36 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. యశస్వీ జైస్వాల్ (9), అభిమన్యు ఈశ్వరన్ (4), ముషీర్ ఖాన్ (డకౌట్), నితీశ్ రెడ్డి (19) నిరాశపరిచారు. ప్రస్తుతం క్రీజులో సుందర్ (6 నాటౌట్) ఉన్నాడు. ఖలీల్ అహ్మద్, ఆకాశ్ దీప్ చెరో రెండు వికెట్లు తీశారు.

కాగా, 134/2 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ఆరంభించిన ఇండియా-ఏ జట్టు 231 పరుగులకు ఆలౌటైంది. రియాన్ పరాగ్ (30), కేఎల్ రాహుల్ (37) టాప్ స్కోరర్. ముకేశ్ కుమార్, నవదీప్ సైని చెరో మూడు, సాయి కిశోర్ రెండు వికెట్లు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement