ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రెండో రౌండ్‌లో భారత్ ఎ జట్టు జోరుమీదుంది. ఈరోజు ఓవర్ నైట్ స్కోరు 288-8తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్-ఎ 290 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో ర్యాన్ పరాగ్ (37), కుమార్ కుషాగ్రా (28) రాణించారు. తనుష్ కొటియన్ (53), సామ్స్ ములానీ (89) అర్ధ సెంచరీలతో మెరిశారు.
అయితే 291 పరుగుల విజయలక్ష్యంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా డి జట్టు కేవలం 183 పరుగులకే ఆలౌటైంది. దేవదత్ పడిక్కల్ (92) హాఫ్ సెంచరీతో రాణించగా, రికీ భుయ్ (23), హర్షిత్ రాణా (31) పరుగులతో పరువాలేదనిపించారు. ఖలీల్ అహ్మద్, అకిబ్ ఖాన్ మూడు వికెట్లు తీయగా, ప్రసాద్ కృష్ణ, తనుష్ కొటియన్, షమ్స్ ములానీ తలో వికెట్ తీశారు.
ఆ తర్వాత భారత ఎ జట్టు రెండో ఇన్నింగ్స్‌కు దిగింది. ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. ప్రథమ్ సింగ్ (59 నాటౌట్), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (56) రెచ్చిపోయారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఎ జట్టు 28.1 ఓవర్లలో 115/1 పరుగులు చేసింది. దీంతో భారత్ డి జట్టు 222 పరుగుల ఆధిక్యంలో ఉంది.