తన బయోపిక్కు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తెల తన పోస్టులో వివరించాడు. మేనేజ్మెంట్, లీగల్ టీమ్లతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపాడు. ఈ సినిమాని కొనసాగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, తన పేరునుగానీ, తన జీవితంలోని సంఘటనలనుగానీ ఉపయోగిస్తే చిత్ర నిర్మాతలపై కఠినమైన చర్యలు తీసుకుంటానని తెలిపాడు.చాలా విచారకరంగా ఉంది. నెలల తరబడి ఆలోచించిన తర్వాత నా లీగల్ టీమ్ ద్వారా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాను. రావల్పిండి ఎక్స్ప్రెస్ చిత్రం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. ఖచ్చితంగా ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. దీనిలో కొనసాగడానికి చాలా ప్రయత్నించాను. కానీ దురదృష్టవశాత్తు అంతా అనుకున్నట్లు జరగలేదన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement