గుజరాత్ టైటాన్స్ ప్లేయర్, వెస్టిండీస్ పేస్ డొమినిక్ డ్రేక్స్ పేరు తెగ వినిపిస్తున్నది. ఇతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.. కానీ ఆడిన రెండు సీజన్స్‌లో ఛాంపియన్ జట్టులో ఉన్నాడు. గతేడాది చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన డొమినిక్ డ్రేక్స్.. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ చెన్నై టైటిల్ గెలిచింది. మెగా వేలానికి ముందు చెన్నై వదులుకోగా.. గుజరాత్ రూ.1.10కోట్లకు సొంతం చేసుకుంది. జట్టు కాంబినేషన్ బాగుండటంతో తుది జట్టులో అవకాశం లభించలేదు. ఒక్క మ్యాచ్ ఆడకపోయినా జట్టు టైటిల్ సొంతం చేసుకుంది.
దీంతో అతను లక్కీ స్టార్ అంటూ అభిమానులు కితాబిస్తున్నారు. భారత్ వెటరన్ స్పిన్నర్ కర్ ్ణ శర్మకు ఐపీఎల్‌లో అత్యంత అదృష్టవంతమైన ఆటగాడిగా పేరుంది. అయితే అతనికి మించి డొమినిక్ లక్కీ ప్లేయర్‌గా నిలిచాడు. కర్ణ్ శర్మ ప్రాతినిథ్యం వహించిన మూడు జట్లు కూడా ఐపీఎల్ టైటిల్ సాధించాయి. జట్టు మారిన ప్రతీసారి ఆ టీమ్ గెలుస్తూ వచ్చింది. శర్మ, ఐదు సీజన్‌లు ఆడితే.. మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచాడు. డొమినిక్ మాత్రం రెండు సీజన్స్ ఆడితే రెండింటిలోనూ ఛాంపియన్ అయ్యాడు. శర్మ, 2016లో హైదరాబాద్‌లో, 2017లో ముంబై ఇండియన్స్, 2018లో చెన్నై సూపర్ కింగ్స్‌్‌లో ఉండగా.. ఈ జట్లు టైటిల్స్ గెలిచాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..