Wednesday, November 20, 2024

ISSF WC | దివ్యాన్ష్ సింగ్ ప్రపంచ రికార్డు.. భారత్‌కు పతకాల పంట !

ఈజిప్ట్‌లోని కైరోలో జరిగిన ప్రపంచకప్‌లో భార‌త్‌కు పతకాల పంట పండింది. భారత షూటర్ దివ్యాన్ష్ సింగ్ పన్వార్ ఇవ్వాల (ఆదివారం) జరిగిన ఫైనల్లో 253.7 స్కోరుతో ప్రపంచ రికార్డు సృష్టించి ఎయిర్ రైఫిల్ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. 21 ఏళ్ల దివ్యాన్ష్‌కు ఇది నాల్గవ (మ్యూనిచ్, బీజింగ్, ఢిల్లీ, ఈజిప్ట్‌) ప్రపంచ కప్ స్వర్ణం విశేషం. ఇక ఇటలీకి చెందిన డానిలో సొల్లాజో 251.8, సెర్బియాకు చెందిన‌ లాజర్ కోవాసెవిక్ 230.6 వ‌రుస‌గా రెండు మూడు స్థానాల్లో నిలిచారు.

ఇక‌ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో రిథమ్ సాంగ్వాన్- ఉజ్వల్ 17-7తో అర్మేనియన్ జోడీ అయిన‌ ఎల్మిరా కరాపెట్యాన్-బెనిక్ ఖల్ఘట్యాన్‌ను ఓడించి స్వ‌ర్ణం సాధించారు. ఇక మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో అనురాధ దేవి రజతంతో జట్టు ఖాతా తెరిచింది. ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో అర్జున్ బాబుటా, సోనమ్ ఉత్తమ్ మస్కర్ రజతం సాధించారు. దీంతో భార‌త్ రెండు స్వర్ణాలు, మూడు రజతాలతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement