భారత యువ చెస్ ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌గా అవతరించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన అండర్-20 అమ్మాయిల ఫీడె చెస్ వరల్డ్ చాంపియన్‌షిప్-2024లో దివ్య విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్ రౌండ్లో నాగ్‌పుర్‌కు చెందిన 18 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ బల్గెరియాకు చెందిన బెలొస్లావా క్రస్టీవాపై విజయం సాధించింది.
టాస్ సీడ్‌గా బరిలోకి దిగిన దివ్య 11 రౌండ్లలో 10 పాయింట్లు సాధించి టాప్ ప్లేస్‌లో నిలిచి విశ్వ విజేత కిరీటాన్ని కైవసం చేసుకుంది. 9 గేమ్స్‌లో గిలిచిన దివ్య రెండు గేమ్‌లను డ్రా చేసుకుంది. గత నెలలో షార్జా వేదికగా జరిగిన షార్జా ఛాలెంజర్స్ టైటిల్‌ను కూడా దివ్య దేశ్‌ముఖ్ గెలుచుకుంది. ఇక ఈ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మరియమ్ (ఆర్మేనియా) 9.5 పాయింట్లతో రెండో ప్లెస్, అజర్ బైజాన్‌కు చెందిన షుడి గుప్తా 8 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు.