Friday, November 22, 2024

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు నిరాశ.. స్పెయిన్‌ చేతిలో 1-0తేడాతో ఓటమి

ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌లో భారత జట్టుకు మరోసారి నిరాశ ఎదురైంది. ఎన్నో ఆశలతో మహిళల హాకీ ప్రపంచకప్‌ ఆడటానికి నెదర్లాండ్స్‌, స్పెయిన్‌ వెళ్లిన భారత జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు వెళ్లాలంటే తప్పకుండా నెగ్గాల్సిన మ్యాచ్‌లో సవిత పునియా నేతృత్వంలోని భారత జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. ఆతిథ్య స్పెయిన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్‌ 0-1తో పరాజయాన్ని మూటగట్టుకున్నది. చివరి నిముషం వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో స్పెయిన్‌ విజయం సాధించి, క్వార్టర్స్‌కు చేరింది. తొలి అర్ధభాగంలో బాగానే రాణించిన అమ్మాయిలు తర్వాత స్పెయిన్‌ డిఫెన్స్‌ను అడ్డుకున్నా చివరి క్షణాల్లో పట్టువిడవడంతో మ్యాచ్‌ చేజారింది.

విశేషమేమిటంటే.. తొలి అర్థభాగంలో ఇరు జట్లు గోల్స్‌ చేయలేదు. కానీ రెండో అర్థభాగం చివరలో స్పెయిన్‌ ఆటగాళ్లు గోల్‌ చేసింది. దీంతో భారత జట్టు ప్రపంచ కప్‌ ఆశలు ఆవిరయ్యాయి. మంగళవారం కెనడాతో సవిత పునియా నేతృత్వంలో భారత జట్టు తలపడనుంది. ఇప్పటికే న్యూజిలాండ్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌, బెల్జియం, ఆస్ట్రేలియా, స్పెయిన్‌, అర్జెంటీనా, ఇంగ్లండ్‌లు క్వార్టర్స్‌కు చేరిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement