క్వాలిఫయర్–1లో భాగంగా ఇవ్వాల (మంగళవారం) చెన్నై చపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ సాధించింది. గుజరాత్‌పై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది.
అయితే.. 173 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు.. ఆది నుంచి ప్రొటెక్టివ్‌గా ఆడుతూ వచ్చింది. అయితే.. మిడ్ ఓవర్లలో వృద్ధిమాన్ సాహా (12) పరుగులకు అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ పాండ్యా (8) పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే.. స్కోరు బోర్డుని మెల్ల మెల్లగా కదిలించడంతోపాటు.. వీలైనప్పుడల్లా ఫోర్లు, సిక్స్‌లతో ఆకట్టుకున్నాడు శుభ్‌మన్ గిల్..
ఇక.. గిల్ (42) అవుట్ కావడంతో గుజరాత్ జట్టు కష్టాల్లో పడింది. అయినా.. రశీద్ ఖాన్ (30) , విజయ్ శంకర్ (14), ఆదుకునే ప్రయత్నం చేసినా వారి జోడీని పతిరానా బౌలింగ్‌లో గైక్వాడ్ క్యాచ్పట్టి విడగొట్టాడు. దీంతో టెయిలెండర్లు బరిలో దిగాల్సి వచ్చింది. ఆఖరికి అన్ని వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేసి, 15 పరుగుల తేడాతో గుజరాత్ ఓటమి చెందింది.. ఇక.. రేపు జరిగే ఎలిమినేటర్ రౌండ్లో (ముంబయి–లక్నో) గెలిచిన వారితో మళ్లీ గుజరాత్ ఆడాల్సి ఉంటుంది.