వచ్చే సీజన్‌లో ఐపీఎల్ ఆడటంపై సీఎస్‌కే కెప్టెన్ ధోనీ క్లారిటీ ఇచ్చాడు. చెన్నై అభిమానుల కోసం చెన్నై గ్రౌండ్లో ఆడాలి.. లేకుంటే వారికి అన్యాయం చేసినవాడిని అవుతాను.. కచ్చితంగా నాకు ఇది లాస్ట్ సీజన్ కాదంటూ ధోనీ స్పష్టం చేశాడు. దీంతో చెన్నై అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. 2023 ఐపీఎల్ సీఎస్‌కే తరఫున ఆడుతానని తేల్చి చెప్పేశాడు. చెన్నై తరఫున చెన్నైలో ఆడకపోవడం.. అభిమానులను అన్యాయం చేసినట్టే అవుతుందన్నారు. ఈ సీజన్ అన్ని మ్యాచులు ముంబైలో జరిగాయన్నారు. ఈ ఐపీఎల్‌లో ముంబై వేదికగా ఐపీఎల్ కు గుడ్ బై చెప్పడం సరైన నిర్ణయం కాదన్నాడు.
వచ్చే సీజన్‌లో కరోనా నిబంధనలు అంతగా ఉండకపోవచ్చు అని, అన్ని జట్లు ముంబైతో పాటు వివిధ వేదికల్లో ఐపీఎల్ మ్యాచులు ఆడే అవకాశం ఉంటుందని తెలిపాడు. సీఎస్‌కే తరపున తాను కూడా వేర్వేరు స్టేడియాల్లో మ్యా చ్‌లు ఆడటానికి వీలవుతుందన్నారు. వివిధ ప్రదేశాల్లోని సీఎస్‌కే అభిమానులకు ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంటుందని, ఫైనల్‌గా చెన్నై స్టేడియంలో కూడా వీడ్కోలు పలికే ఛాన్స్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. రెండేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవన్న ధోనీ.. ఐపీఎల్‌లో ఆడటం ఇదే చివరి సీజన్ అవుతుందో.. లేదో అనేది ఇంకా తనకు ఓ పెద్ద ప్రశ్న లాంటిదే అని చెప్పుకొచ్చాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..