చెన్నైతో జరుగుతున్న ఐపీఎల్ పోరులో ఢిల్లీ బౌలర్లను చిత్తు చిత్తుగా దంచికొట్టారు. అయితే ఢిల్లీ బౌలర్లు కాస్త చివర్లో కుదురుకోవడంతో చెన్నై వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. అయినా ఆరంభంలో కాన్వే (87), రుతురాజ్ (41) రాణించడంతో ఆ జట్టు చాలావేగంగా పరుగులు చేసింది. రుతురాజ్ ఔటైన తర్వాత వచ్చిన దూబే (32) కూడా మంచి ఇన్నింగ్స్ ఆడటంతో 18 ఓవర్లలోనే 187 పరుగులతో పటిష్ట స్థాయిలో నిలిచింది.
అయితే చివర్లో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాయుడు (5), మొయీన్ అలీ (9), ఊతప్ప (0) త్వరగా అవుట్ అయ్యారు. ఇక.. చివర్లో ధోనీ (8 బంతుల్లో 21 నాటౌట్) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో నోర్ట్‌జీ 3, ఖలీల్ అహ్మద్ 2, మిచెల్ మార్ష్ ఒక వికెట్ తీసుకున్నారు. ఢిల్లీ ముందు 209 పరుగులు భారీ లక్ష్యాన్ని పెట్టింది ధోనీ సేన..