Saturday, November 23, 2024

Archery| ధీరజ్‌కు ఒలింపిక్స్‌ బెర్తు ఖరారు

భారత యువ ఆర్చర్‌ ధీరజ్‌ బొమ్మదేవర బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా కాంటినెంటల్‌ క్వాలిఫికేషన్‌ టోర్నమెంట్‌లో రజత పతకంతో మెరిశాడు. దాంతో ఈ 22ఏళ్ల విలుకాడు ప్యారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తు దక్కించుకున్నాడు. దాంతో, మనదేశం నుంచి 2024 విశ్వక్రీడలకు అర్హత సాధించిన తొలి ఆర్చర్‌గా గుర్తింపు సాధించాడు.

ఫైనల్లో చైనీస్‌ తైపీకి చెందిన జిహ్‌ సియాంగ్‌ లిన్‌తో పోటీపడిన ధీరజ్‌ 5-6 (29-28, 27-29, 28-28, 30-28, 25-26) (9-10) పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. భారత సీనియర్‌ ఆర్చర్‌ తరుందీప్‌ రాయ్‌ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

- Advertisement -

కానీ, ధీరజ్‌ అంచనాలకు మించి రాణించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ ఫైనల్లో అతడు ఇరాన్‌ ఆర్చర్‌ సదేగ్‌ అష్రఫీ బవిలీని ఓడించాడు. ఆ తర్వాత జరిగిన సెమీఫైనల్లో ఇరాన్‌కే చెందిన మ#హమ్మదోసీన్‌ గొల్షానీని చిత్తు చేశాడు.

మహిళల వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు ఒలింపిక్స్‌ దక్కించుకోలేకపోయారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన అంకిత భకత్‌ క్వార్టర్‌ ఫైనల్లోనే వెనుదిరిగింది. ఉజ్బెకిస్థాన్‌ ఆర్చర్‌ జియోదఖాన్‌ అబ్దుసత్తరోవా చేతిలో 4-6 (29-23, 27-27, 24-25, 27-27, 24-26తో ఓటమి పాలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement