Saturday, November 23, 2024

Big Breaking: దంచికొట్టిన ధవన్​ సేన.. రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం

సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్​లో భాగంగా ఇవ్వాల (ఆదివారం) రాంచీలో రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్​లో తొలుత టాస్​ గెలిచిన సఫారీలు బ్యాటింగ్​ ఎంచుకున్నారు. ఫస్ట్​ బ్యాటింగ్​లో 278 పరుగులు చేసిన సౌతాఫ్రికా టీమిండియాకు 279 పరుగుల టార్గెట్​ పెట్టింది. అయితే.. తక్కువ స్కోరుకే ఓపెనర్లు శిఖర్​ ధవన్​ (13), శుభ్​మన్​ గిల్​ (28) పరుగులకే ఇద్దరు అవుటయ్యారు. ఆ తర్వాత శ్రేయస్​ అయ్యర్​, ఇషాన్​ కిషన్ (93) దంచికొట్టి ఇండియాని విజయతీరాలకు చేర్చారు​.. ఇక.. శ్రేయస్​ అయ్యర్​ 113, సంజు 30 పరుగులతో నాటౌట్​గా నిలిచారు. ఇంకా 5 ఓవర్లు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఇండియా విజయం సాధించింది.

దీంతో ఆ తర్వాత క్రీజ్​లోకి వచ్చిన శ్రేయస్​ అయ్యరు, ఇషాన్​ కిషన్​ చేయి చేయి కలుపుకుని ఆచి తూచి ఆడారు. మరో వికెట్​ పడిపోకుండా మధ్య మధ్యలో బౌండరీలు కొడుతూ అభిమానులను ఎంటర్​టైన్​ చేశారు. రబడా బౌలింగ్​లో అయితే.. ఇషాన్​ కిషన్​ రెచ్చిపోయి ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు. ఇక.. రబాడా బౌలింగ్​లోని కిషన్​ 86 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓ బాలుని ఈజీగా పుల్​ చేయడంతో అది నేరుగా వెళ్లి రబాడా చేతుల్లో పడింది. అయితే.. దాన్ని క్యాచ్​ చేయడంలో రబాడా మిస్​ అయ్యాడు. ఇట్లా కిషాన్​కి లైఫ్​ దొరికిందని చెప్పవచ్చు.

ఇక.. 33వ ఓవర్​ ప్రారంభంలో ఇషాన్​ కిషాన్​ చేతికి గాయం అయ్యింది. 32వ ఓవర్​లో ఆఖరి బంతిని రబాడా బంప్​ చేయడంతో అది కాస్త కిషాన్​ మణికట్టుకు తగిలింది. దీంతో తీవ్రమైన బాధతో విలవిల్లాడిపోయాడు. ఈ క్రమంలో చాలాసేపు ఆటకు అంతరాయం కలిగింది. వెంటనే ఫిజియోథెరపిస్టులు వచ్చి చేతికి కట్టుకట్టారు. ఇక ఇదే ఓవర్​లో మరో సిక్సర్​ దంచి ఇషాన్​ కిషన్​ 93 పరుగులకు చేరుకున్నాడు. అయితే.. ఆతర్వాత ఓవర్​లో స్పిన్నర్​ వేసిన బంతికి కిషన్​ సిక్స్​ కొట్టబోయి బౌండరీ వద్ద ఉన్న ఫీల్డర్​కి చిక్కాడు. దీంతో సెంచరీకి సమీపంలోకి వచ్చి మిస్​ చేసుకున్నట్టు అయ్యింది.

ఇషాన్​ కిషన్​ అవుటు కావడంతో సంజు శాంసన్​ క్రీజులోకి వచ్చాడు. సంజుతో కలిసి శ్రేయస్​ ఇన్నింగ్స్​ని చక్కదిద్దేపనిలో పడ్డాడు. 42వ ఓవర్​లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక.. సంజు శాంసన్​ కూడా తనదైన శైలిలో ఆడుతూ బౌండరీలు బాదుతూ క్రికెట్​ ప్రేమికులను అలరించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement