Friday, September 20, 2024

Srilanka టెస్టు కెప్టెన్‌గా ధ‌నుంజ‌య్ డిసిల్వా

దిముత్ కరుణరత్నే స్థానంలో శ్రీలంక తమ స్టార్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ ధనుంజయ డిసిల్వాను టెస్టు క్రికెట్​లో కెప్టెన్​గా నియమించింది. దీంతో రెడ్ బాల్ ఫార్మాట్లో శ్రీలంకకు కెప్టెన్​గా వ్యవహరించిన 18వ ఆటగాడిగా ధనుంజయ నిలిచాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 సీజన్​లో సొంతగడ్డపై శ్రీలంక 2-0 తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో జ‌ట్టు సార‌థిని మార్చడం ప్రాధాన్యం సంతరించుకుంది. సొంతగడ్డపై ఆడుతున్న లంక అప్పటి బాబర్ అజామ్ సారథ్యంలోని పాక్ జట్టుపై విజయం సాధిస్తుందని భావించినప్పటికీ పరాజయం పాలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement