హెదరాబాద్, (ప్రభ న్యూస్) : ఇండియన్ మోటర్‌స్పోర్ట్స్ కంపెనీ, ఆర్పీపీఎల్ (రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్) తమ ఫ్రాంచైజీ మోడల్ ఆధారిత ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌ను ప్రకటించింది. సుప్రసిద్ధ నటుడు, వ్యాపారవేత్త విజయ్ దేవరకొండ ఇప్పుడు హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీకి మద్దతునందించ నున్నట్లు వెల్లడించింది. ఈ ఫెస్టివల్ నవంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.
నటుడు, వ్యాపారవేత్త విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ లీగ్ లో భాగం కావడం పట్ల సంతోషంగా ఉన్నానన్నారు. దేశవ్యాప్తంగా క్రీడా ప్రేమికులకు నూతన అవకాశాలను ఇది అందించనుందన్నారు. భారతదేశంలో రేసింగ్‌కు ఇప్పుడు ప్రత్యేక స్థానముందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.