Saturday, November 23, 2024

Rohith Sharma | ఈ హిట్ట‌ర్‌‌కు ఏమైంది… ఫామ్ కోసం తంటాలు

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు వివాదాలు కొత్త కాదు. కొన్ని తనకు సంబంధం లేకుండా వస్తే, కొన్ని తనకు తానుగా క్రియేట్ చేసుకుని తెచ్చుకుంటాడు. అంటే ఇంటర్నేషనల్ పిచ్ లపై కామెంట్లు చేస్తాడు. ఇండియన్ పిచ్ లపై విమర్శిస్తే ఊరుకోడు. ఇక పరోక్షంగా చూస్తే, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తనకి సంబంధం లేకుండా కెప్టెన్సీ నుంచి తీసేయడంతో వివాదాల్లో పడ్డాడు. ముంబై జట్టు గెలుస్తున్నా, ఓడుతున్నా జట్టులో మాత్రం ఇబ్బందులు తగ్గినట్టే కనిపిస్తున్నాయి.

ఇదంతా ఒకలా ఉంటే ప్రస్తుతం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ అందరినీ కలవరపెడుతోంది. టీమ్ ను ప్రకటించిన తర్వాత ఇప్పటికి 3 మ్యాచ్ లు ఆడితే, అన్నింట్లోనూ 10 లోపే అయిపోతున్నాడు. ఇది టీమ్ మేనేజ్మెంట్ ని కలవరపెడుతోంది. రోహిత్ శర్మ ఫామ్ పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.రోహిత్ నాలుగోసారి కమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

ఐపీఎల్ 2024 సీజన్ ఫస్టాఫ్‌లో పర్వాలేదనిపించిన రోహిత్.. సెకండాఫ్‌లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. తొలి 7 ఇన్నింగ్స్‌ల్లో 297 పరుగులు చేసిన రోహిత్ తర్వాతి 5 ఇన్నింగ్స్‌ల్లో 34 పరుగులు మాత్రమే చేశాడు. వీటిని చూసిన ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ఆందోళన వ్యక్తం చేశాడు. ఇది కరెక్ట్ కాదని, ఇది మంచి పరిణామం కాదని అన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement