ఐపిఎల్ 2023 16వ సీజన్ లో భాగంగా ఇవ్వాల రాత్రి ఢిల్లీ, గుజరాత్ మద్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ. అయిదు పరుగుల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ జట్టు 19 వ ఓవర్ లో తేవాటియా వరుసగా 3 సిక్స్ లు కొట్టి విజయానికి చేరువకు తెచ్చాడు.. ఆఖరి ఓవర్ లో గెలుపునకు 12 రన్స్ చేయాల్సి వచ్చింది… ఇషాంత్ వేసిన 20వ ఓవర్లో 12 పరుగులు కావాలి. నాలుగో బంతికి రాహుల్ తెవాటియా(20) ఔటయ్యాడు. రషీద్ ఖాన్(2) రెండు రన్స్ తీశాడు. ఆఖరి బంతికి 7 రన్స్ అవసరమయ్యాయి. రషీద్ ఒక్క పరుగు తీశాదు. . దాంతో, ఢిల్లీ 5 పరుగుల తేడాతో గెలిచింది. హార్దిక్ పాండ్యా(59) నాటౌట్‌గా నిలిచాడు
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఢల్లీ. కాగా, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి కేవలం 130 పరుగులు చేయగలిగింది ఢిల్లీ టీం. . ఇక హార్డిక్ కప్టెన్సీ వహిస్తున్న గుజరాత్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 120 బంతుల్లో 131 పరుగులు చేయాల్సి ఉంది. అయితే 125 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ కాపిటల్స్ బాట్స్ మెన్స్ దాదాపు వచ్చిన వాళ్లు వచ్చినట్టుగానే పెవెలియన్ చేరుకున్నారు. దీంతో 5 ఓవర్లలోనే 5 వికెట్లు నష్టపోయింది ఢిల్లీ జట్టు. ఇక ఢిల్లీ ఆశలు ఆవిరి అవుతున్నాయి అన్న సమయంలో అక్షర్ పటేల్ 30 బంతుల్లో 27 పరుగులు చేయగా, అమన్ హకీమ్ ఖాన్ 44 బంతుల్లో 51 పరుగులు తో అర్థ సెంచరీ చేసి ఢిల్లీ జట్టుని ఆదుకున్నాడు. అక్షర్ తరువాత వచ్చిన రిపాల్ పటేల్ 12 బంతుల్లో 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. గుజరాత్ బౌలర్లలో షమీ నాలుగు, రషీద్ ఒకటి, మోహిత్ శర్మ రెండు వికెట్లు తీసుకున్నారు
Deception at its best! 👊🏻
— IndianPremierLeague (@IPL) May 2, 2023
What a ball that from @ImIshant 🔥🔥#GT have lost four wickets now and this is turning out to be a tricky chase!
Follow the match ▶️ https://t.co/VQGP7wSZAj #TATAIPL | #GTvDC pic.twitter.com/j7IlC7vf0X