చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య ఇవ్వాల (బుధవారం) రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ధోనీ.. ఆ తర్వాత బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే.. టాపార్డర్ నుంచి మిడిలార్డర్ వరకు అనుకున్న స్థాయిలో ఆటతీరు లేకపోయినా.. పర్వాలేదు అనిపించారు. తలా 20 పరుగులకు పైగానే చేశారు. దీంతో ఎనిమిది వికెట్లు కోల్పోయిన చెన్నై 167 పరుగులు చేసి, ఢిల్లీ జట్టు మందు 168 పరుగుల టార్గెట్ పెట్టింది..
ఇక.. చేజింగ్ చేసే క్రమంలో ఢిల్లీ జట్టుకు ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (0) గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో ఖాతా తెరవకుండా ఢిల్లీ వికెట్ కోల్పోవడంతో కాస్త నిరశగా ఉంది. అయితే.. ఫిలిప్ సాల్ట్ (17), మనీశ్ పాండే (27), రీలీ రోస్సో (35), అక్షర్ పటేల్ (21) పరుగులతో రాణించినా.. అనుకున్న టార్గెట్ ఛేదించడంలో వెనకబడిపోయారు. దీంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో చెన్నై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది.