హైదరాబాద్ – సన్ రైజర్స్ కు సొంత గ్రౌండ్ లో మరో ఓటమి మూటగట్టుకుంది.. సన్ రైజర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 7 పరుగుల తేడాతో విజయ సాధించింది. 145 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి ఓటమి పాలైంది
.హైదరాబాద్ తొలి వికెట్ పడింది అన్రిచ్ నార్జ్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్(7) స్వాప్ షాట్‌కు ప్రయత్నించి బౌల్డయ్యాడు. రెండో వికెట్ . ఓపెనర్ మయాంక్ అగర్వాల్(49) ఔటయ్యాడు. అక్షర్ పటేల్ ఓవర్‌లో మయాంక్ భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. దాంతో, 69 వద్ద రెండో వికెట్ పడింది. వికెట్ ఇంపాక్ట్ ప్లేయర్ రాహుల్ త్రిపాఠి(15) ఔటయ్యాడు. ఇషాంత్ ఓవర్‌లో కీపర్ ఫిలిఫ్ సాల్ట్ క్యాచ్ పట్టడంతో అతను ఔటయ్యాడు. నాలుగో వికెట్ . కుల్దీప్ ఓవర్‌లో అభిషేక్ శర్మ(5) ఔటయ్యాడు. స్లో డెలివరీకి అతడికే క్యాచ్ ఇచ్చి అభిషేక్ వెనుదిరిగాడు. అక్షర్ పటేల్ బిగ్ వికెట్ తీశాడు. ఎయిడెన్ మర్‌క్రం(3)ను బౌల్డ్ చేశాడు. దీంతో అయిదో వికెట్ కోల్పోయింది. ఆరో వికెట్ గా .అన్రిచ్ నార్జ్ ఓవర్‌లో హెన్రిచ్ క్లాసెన్(31) ఔటయ్యాడు.
సొంత గ్రౌండ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు చెలరేగారు. వాషింగ్టన్ సుందర్ సూపర్ బౌలింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ని దెబ్బకొట్టాడు మొదట బ్యాటింగ్ తీసుకున్న ఢిల్లీకి తొలి ఓవర్‌లోనే షాక్.. రెండో బంతికే ఓపెనర్ ఫిలిఫ్ సాల్ట్(0)గోల్డెన్ డకౌటయ్యాడు. మిచెల్ మార్ష్(25)ను నటరాజ్ ఎల్బీగా వెనక్కి పంపాడు. దాంతో, 39 పరుగులకే ఢిల్లీ రెండు వికెట్లు కోల్పోయింది. ఏడో ఓవర్‌లో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీసి ఢిల్లీని దెబ్బ కొట్టాడు. డేవిడ్ వార్నర్(21), సర్ఫరాజ్ ఖాన్ (10), అమన్ ఖాన్(4)లను పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత మనీశ్ పాండే(34), అక్షర్ పటేల్(34) ఆదుకున్నారు. ఆచితూచి ఆడి స్కోర్ వంద దాటించారు. భువనేశ్వర్ వేసిన 20వ ఓవర్‌లో అన్రిచ్ నార్జ్(2), రిపల్ పటేల్(5) రనౌటయ్యారు. ఆఖరి బంతికి కుల్దీప్ యాదవ్ (4) బౌండరీ బాదాడు. దాంతో, ఢిల్లీ 9 వికెట్ల నష్టానికి 144 రన్స్ చేసింది. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు, భువనేశ్వర్ కుమార్ రెండు, నటరాజన్ ఒక వికెట్ తీశారు