ముంబై – ముంబైలోని బ్రబౌర్నే స్టేడియంలో జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ టి 20 రెండో మ్యాచ్‌లోనూ రెండొందల స్కోర్ నమోదైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 223 పరుగులు చేసింది. దీనికి జవాబుగా ఆర్సీబి కేవలం మూడు ఓవర్లలోనే 40 పరుగులు చేసింది.. ఓపెనర్లు స్మృతి మందన, సోఫియాలు దూకుడుగా బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.. అంతకు ముందు డిళ్లీ ఓపెనర్లు వీరబాదుడుతో ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్లు మేగ్ లానింగ్ (72), షఫాలీ వర్మ (84) వీర బాదుడు బాదారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన వీళ్లు అర్ధ శతకాలు సాధించారు. వీళ్ల దూకుడు చూస్తే ఒక దశలో ఢిల్లీ 250పైగా స్కోర్ చేసేలా కనిపించింది. కానీ, హీథర్ నైట్ ఈ జోడీని విడదీసి బ్రేక్ ఇచ్చింది. 15వ ఓవర్‌లో లానింగ్, షఫాలీని ఔట్ చేసింది. లానింగ్ బౌల్డ్ కావడంతో, 162 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. దాంతో, ఆర్సీబీ బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు అయినా కూడా స్కోర్ వేగం తగ్గలేదు. జెమీమా రోడ్రిగ్స్ (22), మరిజానే కాప్ (39) ఫోర్లు, సిక్సర్లతో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీళ్లు మూడో వికెట్‌కు 60 రన్స్ జోడించారు.
టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు ఓపెనర్ షఫాలీ వర్మ, మేగ్ లానింగ్ లే తొలి బంతి నుంచే దూకుడుగా ఆడారు.. షెపాలీ 32 బంతుల్లో ఫిఫ్టీ బాదింది. ఈ లీగ్‌లో రెండో అర్ధ శతకం నమోదు చేసింది. ఆ తర్వాత లానింగ్ కూడా ఫిఫ్టీకి చేరువైంది. వీళ్లిద్దరూ తొలి వికెట్‌కు 163 పరుగులు జోడించారు. షఫాలీ 45 బంతుల్లోనే 84 రన్స్ చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. ఈ మ్యాచ్ జరుగుతోంది. కాగా ఈరోజు రెండు మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు.. రెండో మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు గుజరాత్ జెయింట్స్ , యుపి వారియర్స్ మధ్య జరగనుంది..