టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్‌లో డిఫెండింగ్ చాంపియన్ మార్కెటా ఒడ్రుసోవా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆమె అన్‌సీడెడ్ చేతిలో ఊహించని పరాజయంతో టోర్నీని ముగించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న జెస్సికా చేతిలో 4-6, 2-6తో ఓడిపోయింది.
మరోవైపు మాజీ చాంపియన్ ఎలీనా రిబాకినా, జెస్సికా పెగులాలు ముందంజ వేశారు. 2022లో వింబుల్డన్ ట్రోఫీని ముద్దాడిన రిబాకీనా తొలి సెట్ నుంచి దూకుడుగా ఆడి ఎలెనా గాబ్రియెల్లా రూసెను మట్టికరిపించింది. మరో మ్యాచ్‌లో జెస్సికా సూపర్ షోతో అష్లిన్ క్రుగెర్ 6-2, 6-0తో చిత్తుగా ఓడించి రెండో రౌండ్‌లో అడుగు పెట్టింది.
పురుషుల సింగిల్స్..
మరోవైపు పురుషుల సింగిల్స్ లో దిగ్గజ ఆటగాడు ఏడుసార్లు వింబుల్డన్ ఛాంపియన్ అయిన నోవాక్ జకోవిచ్ మంగళవారం జరిగిన మ్యాచ్ లో విట్ కొప్రివాను 6-1, 6-2, 6-2తో ఓడించి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు.