Saturday, October 5, 2024

Wimbledon | ఫైనల్లో దూసుకెళ్లిన డిఫెండింగ్‌ చాంపియన్‌..

ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ కార్లోస్‌ అల్కరాజ్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన స్పెయిన్‌ యువ సంచలనం మూడో సీడ్‌ అల్కరాజ్‌ సెమీస్‌లో రష్యాకు చెందిన ఐదో సీడ్‌ డానిల్‌ మెద్వెదేవ్‌పై అద్భుత విజయం సాధించి వరుసగా రెండో ఎడాది వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి సెమీస్‌లో 3వ సీడ్‌ అల్కరాజ్‌ 6-7 (1-7), 6-3, 6-4, 6-4 తేడాతో 5వ సీడ్‌ మెద్వెదేవ్‌ను చిత్తుగా ఓడించాడు.

వింబుల్డన్‌లో రోహిత్‌ సందడి..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సందడి చేశాడు. వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత ఫ్యామిలీతో కలిసి హిట్‌మ్యాన్‌ లండన్‌ పర్యటనకు వెళ్లాడు. అక్కడ జరుగుతున్న ప్రముఖ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో శుక్రవారం హాజరయ్యాడు. అక్కడ విజిటర్స్‌ గ్యాలరీలో కూర్చొని సెమీఫైనల్‌ మ్యాచ్‌ వీక్షించాడు. అతడికి వింబుల్డన్‌ నిర్వహాకులు స్వాగతం పలుకుతు ఎక్స్‌లో రోహిత్‌ ఫోటోను పోస్ట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement