ఇండియా ఓపెన్ ఫైనల్‌లో భారత్ కు నిరాశే మిగిలింది. పురుషుల డబుల్స్ ఫైనల్స్‌లో భారత స్టార్ ద్వయం సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి – చిరాగ్ శెట్టి ఓటమిపాలయ్యారు. దక్షిణ కొరియా సీయో సీయుంగ్ జే – కాంగ్ మిన్-హ్యూక్ లతో జరిగిన మ్యాచ్‌లో 21-15, 11-21, 19-21 తేడాతో ఓడిపోయి ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచారు.
మహిళల టైటిల్‌ను మాజీ వరల్డ్ ఛాంపియన్, చైనీస్ తైఫీకి చెందిన తై జూ యింగ్ దక్కించుకుంది. ఆదివారం ఢిల్లీ లోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియం వేదికగా ముగిసిన మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో తై జూ.. 21-16, 21-12 తేడాతో చైనా క్రీడాకారిణి చెన్ యూ ఫీని ఓడించింది. వరుస సెట్లలో గెలిచిన తై జూ… ఇండియా ఓపెన్ టైటిల్‌ను దక్కించుకుంది.
మిక్స్‌డ్ డబుల్స్‌లో థాయ్‌లాండ్ ద్వయం డెచాపుల్ పువరనుక్రో – సప్సైర్‌లు.. 21-16, 21-16 తేడాతో చైనాకు చెందిన వరల్డ్ నెంబర్ 5 ర్యాంకర్ జోడీ జియాంగ్ జెన్ – వి యా జిన్‌లను ఓడించింది. నేటి సాయంత్రం పురుషుల సింగిల్స్‌లో చైనా ప్లేయర్ షి యుకీ – లీ చెక్ యూ (హాంకాంగ్) మధ్య పోరు జరగాల్సి ఉంది. పురుషుల డబుల్స్‌లో భారత స్టార్ ద్వయం సాత్విక్ – చిరాగ్‌ల ద్వయం.. వరల్డ్ ఛాంపియన్స్ జోడీ కంగ్ మిన్ హ్యూక్ – సియో సియుంగ్ జే (సౌత్ కొరియా)లను ఢీకొనబోతున్నారు.