వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా బరిలోకి దిగడం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మను ఇబ్బంది పెడుతుందని అన్నాడు మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్. మరోవైపు ప్రత్యర్థి న్యూజిలాండ్ మాత్రం ఈ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్‌తో రెండు టెస్టులు ఆడుతుండటం వాళ్లకు కలిసొచ్చే అంశమని అభిప్రాయపడ్డాడు.
కోహ్లి, రోహిత్ మంచి ఫామ్‌లో ఉన్నా కూడా.. ఈ మధ్య కాలంలో టెస్టుల్లో మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం వాళ్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నదని వెంగ్‌సర్కార్ అన్నాడు. ఇండియా కంటే కాస్త ముందు నిలబెట్టిందని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటు పడటానికి ఈ మ్యాచ్‌కు ముందు ఇండియా కనీసం రెండు, మూడు మ్యాచ్‌లు ఆడితే బాగుండేదని వెంగ్‌సర్కార్ అన్నాడు. నెట్ ప్రాక్టీస్ ఎంత చేసినా.. మ్యాచ్ ప్రాక్టీస్ ఉండటం అన్నది చాలా ముఖ్యమని స్పష్టం చేశాడు.