హైదరాబాద్, ఆంధ్రప్రభ : బధిరుల మొదటి టీ-20 క్రికెట్ ప్రపంచ కప్‌కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వబోతోందని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరెడ్డి చెప్పారు. ఈ మేరకు సాట్స్ ఛైర్మన్‌ను మంగళవారం రాష్ట్ర బధిరుల క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచ కప్ బ్రోచర్‌ను ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరెడ్డి ఆవిష్కరించారు. ప్రపంచ మొట్ట మొదటి బధిరుల టీ-20 ప్రపంచ్ కప్ హైదరాబాద్‌లోమే 27 నుంచి జూన్ 27-2023 వర కు జరగనున్నాయిన తెలిపారు.
అన్ని దేశాల నుంచి దిగ్గజ ఆటగాళ్లు ఈ కప్‌లో ఆడనున్నారని చెప్పారు. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, కెనడా, దక్షిణ కొరియా, కెన్యా, సింగపూర్ జట్లు ప్రపంచ కప్ కోసం హోరాహోరీ తలపడనున్నాయి.