ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన చివరి టెస్టు ఆడేందుకు జట్టుతో కలిసి మెల్బోర్న్ నుంచి సిడ్నీకి వెళుతుండగా బ్యాగ్ చోరీకి గురైంది. బ్యాగ్‌లో తనకు సంబంధించిన చాలా విలువైన వస్తువులు ఉన్నాయని వార్నర్ పేర్కొన్నాడు. తన బ్యాగ్ ఎవరైనా తీసుకెళ్లి ఉంటే తిరిగి ఇవ్వాలని కోరాడు.
అయితే పోయిందనుకున్న తన బ్యాగ్ ఆచూకీ లభించింది. రోజుల తరబడి వెతికిన తరువాత తన బ్యాగ్ సిడ్నీలోని టీమ్ హోటల్లో దొరికినట్టు ప్రకటించారు. తన బ్యాగ్ ను తిరిగి పొందడం చాలా సంతోషంగా, ఉపశమనంగా ఉందని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు వార్నర్.
ఇక పోతే, సిడ్నీలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టుతో ఈ లాంగ్ ఫార్మాట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకనునున్నాడు వార్నర్. 2011 అరంగేట్రం చేసిన వార్నర్ 44.53 యావరేజ్ తో 26 సెంచరీలు 8,729 టెస్ట్ పరుగులు చేశాడు.