Tuesday, October 22, 2024

David Warner | నేను రెడీ… రిటైర్మెంట్ పై యూట‌ర్న్ !

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది జనవరిలో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వార్నర్.. మళ్లీ బ్యాగీ గ్రీన్ ధరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపాడు. బోర్డర్ గవాస్కర్ ఆడేందుకు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టు ప్రకటించాడు.

కోడ్ స్పోర్ట్స్ అనే వెబ్‌సైట్‌తో మాట్లాడిన వార్నర్…. దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పాడు. సెలక్టర్ల నుంచి ఫోన్ రావడమే ఆలస్యం అని ప్రకటించాడు. ఇదిలా ఉండగా వార్నర్ తాజా ప్రకటన నేపథ్యంలో ఆసీస్ సెలక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement