ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన అభిమానులకు షాకిచ్చాడు. పాకిస్తాన్‌తో ప్రారంభం కానున్న మూడో టెస్టు మ్యాచ్‌తో ఈ లాంగ్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకున్న వార్నర్.. ఓడిఐలకు సైతం గుడ్‌బై చెప్పినట్టు ప్రకటించాడు. గత ఏడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచే తనకు వన్డేల్లో చివరిది అని చెప్పి ఫ్యాన్స్‌కు షాకిచ్చాడు.
ఇక, ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు దూరం అయిన వార్నర్.. సరికొత్త బాధ్యతలు అందుకోనున్నాడు. జనవరి 20 నుంచి ఫ్రిబ్రవరి 18 వరకు జరగనున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20) లో దుబాయ్ క్యాపిటల్స్ కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని సదరు ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా వెల్లడిచింది. కెప్టెన్ మార్వెల్ అంటూ ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. కాగా.. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అనుబంధ జట్టు దుబాయ్ క్యాపిటల్స్ అన్న సంగతి తెలిసిందే.