Friday, October 25, 2024

WTC | వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌కి డేట్ ఫిక్స్.. !

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్స్‌కు తేదీ ఖరారైంది. ఇందుకు సంబంధించిన వివరాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా వెల్లడించింది. ఈ మెగా టెస్ట్ ఫైనల్ జూన్ 11-15 మధ్య లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరుగుతుందని ఐసీసీ తమ ప్రకటనలో తెలిపింది. జూన్ 16 రిజర్వ్ డేగా నిర్ణయించారు. కాగా, లార్డ్స్ వేదిక‌గా డబ్ల్యూటీసీ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి.

టెస్టులకు ఆదరణ పెంచే లక్ష్యంతో ఐసీసీ 2019లో డబ్ల్యూటీసీ టోర్నీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. డబ్ల్యూటీసీ 2019-2021 ఫైనల్ మొదటి ఎడిషన్ సౌతాంప్టన్ వేదికగా జరగగా.. న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. ఫైనల్లో విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియాను ఓడించి కివీస్ తొలి డబ్ల్యూటీసీ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

సౌతాంప్టన్‌లోని ఓవల్‌ మైదానంలో జరిగిన తదుపరి ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరిన భారత్‌.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఇక డబ్ల్యూటీసీ 2023-25 ​​తాజా ఎడిషన్‌లో, భారతదేశం ఫైనల్‌కు చేరుకునే దిశగా సాగుతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, ఆసీస్ రెండో స్థానంలో, న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉన్నాయి.

పాకిస్థాన్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్ నాలుగో స్థానానికి దూసుకొచ్చింది. వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్‌లతో టెస్ట్ ఫార్మాట్‌కు దూరంగా ఉన్న టీమిండియా.. రాబోయే నాలుగు నెలల్లో మూడు టెస్ట్ సిరీస్‌లు (మొత్తం 10 టెస్ట్ మ్యాచ్‌లు) ఆడనుంది. ఆడనుంది. సెప్టెంబర్ 19 నుంచి భారత్ వేదికగా బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది.

తర్వాత న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. అనంతరం ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఒకవేళ భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరితే.. ఈ మ్యాచ్ ముగిసిన ఐదు రోజులకే ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement