ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఇవ్వాల (ఆదివారం) రాత్రి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్డేడియంలో ఈ మ్యాచ్ ఉత్కంఠను రేపింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో 171 పరుగులు చేసింది. బెంగళూరుకు 172 పరుగుల టార్గెట్ నిర్ధేశించింది. కాగా, ఈ జట్టులో ఓపెనర్లుగా కెప్టెన్ డూప్లిసెస్, కింగ్ విరాట్ కోహ్లీ వచ్చారు. వీరిద్దరు కలిసి ముంబై బౌలర్లను ఈజీగా ఎదుర్కొంటూనే స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
ముందుగా హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్న డూప్లిసెస్ దూకుడు మీదుంటే.. ఆ తర్వాత కొద్ది సేపటికే దీటుగా ఆడి కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో స్టేడియంలో కోహ్లీ కోహ్లీ అంటూ పెద్ద పెట్టున అరుపులు, కేకలు వినిపించాయి. కోహ్లీ కూడా బ్యాట్‌ని పైకెత్తి, మరో చేత్తో గుండెలపై చూపిస్తూ అభిమానులను ఎంకరైజ్ చేశాడు.
ఇక.. 15వ ఓవర్లో డూప్లిసెస్ సిక్స్ బాదబోయి బోర్డర్లో క్యాచ్‌గా దొరికిపోవడంతో అతని ఆట ముగిసింది. దీంతో క్రీజులోకి దినేశ్ కార్తీక్ వచ్చి ఆడిన తొలి బంతికే అవుటయ్యాడు. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్ 12 తో కలిసి.. కింగ్ కోహ్లీ 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆటను కంప్లీట్ చేశాడు.. బెంగళూరు జట్టుకు విజయాన్ని అందించాడు. కేవలం రెండు వికెట్ల నష్టంతోనే బెంగళూరు జట్టు ముంబైపై సునాయసంగా గెలిచింది. ఎనిమిది వికెట్ల విజయాన్ని సొంతం చేసుకుంది.