ఢిల్లీతో జరిగిన లీగ్ ఆఖరి మ్చాచ్‌లో చెన్నై మాస్ హిస్టరీ క్రియేట్ చేసింది. తొలుత బ్యాటింగ్చేసిన ధోనీ సేన.. కోట్ల పిరోజ్షా మైదానంలో పరుగుల వరద పారించింది. స్టేడియం చిన్నది కావడంతో బాల్ పుల్ చేయగానే సిక్స్‌లు, ఫోర్ల మోత మోగింది. దీంతో క్రికెట్ అభిమానులకు కన్నుల విందే అయ్యింది. మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (79), డేవాన్ కాన్వే (87), శివమ్ దూబే (22) పరుగులు చేసి భేష్ అనిపించుకున్నారు. ఇక చివర్లో రవీంద్ర జడేజా 20, కెప్టెన్ ధోనీ 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచిరు. ఈ క్రమంలో చెన్నై మూడు వికెట్లు మాత్రమే నష్టపోయా 223 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఇక..224 పరుగుల టార్గెట్‌తో చేజింగ్‌కు దిగిన ఢిల్లీ ఆదిలోనే త్వర త్వరగా వికెట్లను కోల్పోయింది. అయినా ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఒంటిరి పోరు చేశాడు. ఈ క్రమంలో ఢిలీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్జట్టు 77 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఇక.. ఐపీఎల్ 16వ సీజన్లో చెన్నై ప్లే ఆఫ్స్‌లో సెకండ్ ప్లేస్‌ని కైవసం చేసుకుంది..
ఇక.. ప్రిథ్విషా (5), పిలిప్ సాల్ట్ (3), రీలీ రోసో (0), యశ్‌దుల్ (13), అక్షర్ పటేల్ (15), అమన్ ఖాన్ (7), లలిత్ యాదవ్ (6), కుల్దీప్ యాదవ్ (0), సకారియా 0, నోర్తుజా 0 నాటౌట్‌గా నిలిచారు. కాగా, చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 3, మహేశ్ తీక్షణ, మహేశ పతిరాణా తలా రెండు వికెట్లు తీయగా.. జడేజా, దేశ్‌పాండే తలా ఒక వికెట్ పడగొట్టారు.