Thursday, November 21, 2024

Big Breaking | దంచికొట్టి, వికెట్లను కూల్చి.. చెన్నై సూపర్​ విక్టరీ!

ఢిల్లీతో జరిగిన లీగ్​ ఆఖరి మ్చాచ్​లో చెన్నై మాస్​ హిస్టరీ క్రియేట్​ చేసింది. తొలుత బ్యాటింగ్​చేసిన ధోనీ సేన.. కోట్ల పిరోజ్​షా మైదానంలో పరుగుల వరద పారించింది. స్టేడియం చిన్నది కావడంతో బాల్​ పుల్​ చేయగానే సిక్స్​లు, ఫోర్ల మోత మోగింది. దీంతో క్రికెట్​ అభిమానులకు కన్నుల విందే అయ్యింది. మ్యాచ్​లో రుతురాజ్​ గైక్వాడ్​ (79), డేవాన్​ కాన్వే (87), శివమ్​ దూబే (22) పరుగులు చేసి భేష్​ అనిపించుకున్నారు. ఇక చివర్లో రవీంద్ర జడేజా 20, కెప్టెన్​ ధోనీ 5 పరుగులతో నాటౌట్​గా నిలిచిరు. ఈ క్రమంలో చెన్నై మూడు వికెట్లు మాత్రమే నష్టపోయా 223 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఇక..224 పరుగుల టార్గెట్​తో చేజింగ్​కు దిగిన ఢిల్లీ ఆదిలోనే త్వర త్వరగా వికెట్లను కోల్పోయింది. అయినా ఢిల్లీ కెప్టెన్​ డేవిడ్​ వార్నర్​ ఒంటిరి పోరు చేశాడు.  ఈ క్రమంలో ఢిలీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో చెన్నై సూపర్​ కింగ్స్​జట్టు 77 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఇక.. ఐపీఎల్​ 16వ సీజన్​లో చెన్నై ప్లే ఆఫ్స్​లో సెకండ్​ ప్లేస్​ని కైవసం చేసుకుంది..

ఇక.. ప్రిథ్విషా (5), పిలిప్​ సాల్ట్​ (3), రీలీ రోసో (0), యశ్​దుల్​ (13), అక్షర్​ పటేల్​ (15), అమన్​ ఖాన్​ (7), లలిత్​ యాదవ్​ (6),  కుల్దీప్​ యాదవ్​ (0), సకారియా 0, నోర్తుజా 0 నాటౌట్​గా నిలిచారు. కాగా, చెన్నై బౌలర్లలో దీపక్​ చాహర్​ 3, మహేశ్​ తీక్షణ, మహేశ పతిరాణా తలా రెండు వికెట్లు తీయగా.. జడేజా, దేశ్​పాండే తలా ఒక వికెట్​ పడగొట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement