ముంబయి, గుజరాత్ జట్ల మధ్య ఇవ్వాల (శుక్రవారం) రాత్రి జరుగుతున్న క్వాలిఫయర్2లో తొలుత గుజరాత్ జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 233 పరుగుల అత్యధిక స్కోరు చేసింది. ఇందులో శుభ్‌మన్ గిల్ 60 బంతుల్లో 129 పరుగులు చేశాడు. కాగా, ముంబయి టార్గెట్ 234 పరగులుగా ఉంది. మరికాసేపట్లో రోహిత్ సేన టార్గెట్ చేజింగ్ చేయనుంది.
ఇందులో.. సాయి సుదర్శన్ (43), హార్దిక్ పాండ్యా 28, రశీద్ ఖాన్ 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.